Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Balakrishna: బాలయ్యకు జోడీగా మిల్కీ బ్యూటీ .. కాజల్‌ను కూడా అడిగారటMovie Mode

 

బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మిల్కీ బ్యూటీని, కాజల్‌ని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట.
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా టీం నుంచి క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే అంజలిని ఎంపిక చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె బాలయ్య హీరోయిన్‌గా నటించడం లేదని, వేరే క్యారెక్టర్ చేస్తోందని కొందరి వాదన. అయితే బాలయ్య, బోయపాటి సినిమాలో అసలు హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటికి వచ్చింది. సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్‌లో ఎవరో ఒకర్ని ఎంపిక చేసుకోవాలని బోయపాటి ప్లాన్ వేసారట.

Post a Comment

0 Comments